

జనం న్యూస్ 30 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ సూచన మేరకు ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ మాట్లాడుతూ
జాతిపిత మహాత్మాగాంధీకి. శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం
ఓ మహాత్మా…
ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు. ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు..
ఈ చేతకాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు..
ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు..
ఓ మహాత్మా.మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి, మీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతిపథంలో నడిపించాం.. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం.. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా, సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా కెసిఆర్ తీర్చిదిద్దారు
అయితే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి 30న 420 రోజులు పూర్తిచేసుకుంటోంది. మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డుకు, ఇచ్చిన 420 హామీలకు పాతరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్నారు.
దేశానికి వెన్నుముక అయిన రైతుకు తెలంగాణలోని రేవంత్ సర్కారు వరుస వెన్నుపోట్లు పొడుస్తోంది. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాదిపాటు ఊరించిఊరించి చివరికి 6 వేలే ఇస్తామని ఉసూరుమనిపించింది. చివరికి వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పుల పాలు చేసింది. ఎరువులు, విత్తనాల కోసం మళ్లీ క్యూలైన్లు, వేళాపాళా లేని కరెంట్ కోతలు, వరికి 500 బోనస్ పేరిట బోగస్ మాటలు, ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతన్నకు ఈ 420 రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలు. ఓవైపు రుణమాఫీ మోసం.. మరోవైపు పెట్టుబడి భారం తట్టుకోలేక ఇప్పటికే 410 మందికి పైగా రైతుల బలవన్మరణాలకు కారణమైంది ఈ కాంగ్రెస్ సర్కారు. మరోవైపు నేతన్నలకిచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కడంతో చేనేత బతుకులు చితికిపోతున్నాయి.
మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం అందిస్తామని మోసం చేయడంతో ఆడబిడ్డలు రగిలిపోతున్నారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లు 4 వేలకు పెంచుతామని నమ్మబలికి ఏడాదైనా ఉలుకూ పలుకూ లేని సర్కారు తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. యువతకు 2 లక్షల ఉద్యోగాల హామీని, జాబ్ క్యాలెండర్ వాగ్దానాన్ని మొత్తంగా ముఖ్యమంత్రి గంగలో కలిపేశారు. చివరికి బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను తన జేబులో వేసుకునే నీచ రాజకీయాలకు తెరతీశారు. యువత భవితను అంధకారంలోకి నెట్టి క్షమించలేని పాపాన్ని మూటగట్టుకున్నారు. 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా 420 రోజులైనా సరిగా అమలుచేయని ఈ కాంగ్రెస్ సర్కారు మోసాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. గల్లీలో ఉండే కాంగ్రెస్ నేతలే కాదు.. ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు కూడా గాలిమాటలు చెప్పి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. గాలిమోటర్లో వచ్చి గ్యారెంటీ కార్డు పేరిట, డిక్లరేషన్ల పేరిట దగా చేశారు. అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఇప్పటివరకు ఆ నకిలీ గాంధీలు తెలంగాణ వైపు కనీసం కూడా కన్నెత్తి చూడలేదు..అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ వైఫ్ చైర్మన్ శేషగిరి మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేష్ మాజీ మార్కెట్ డైరెక్టర్ తంగేడ మహేందర్ మండల సీనియర్ నాయకులు మదన్ మోహన్ రావు చిర్ర కొమురెల్లి కుర్ర సాంబమూర్తి గౌడ్ వేముల సమ్మయ్య నాయినేని వెంకట్రావు సతీష్ మండ కిరన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు