జనం న్యూస్ అక్టోబర్ 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటేయడం ద్వారా ప్రజల అభివృద్ధి, పారదర్శక పాలన, మరియు ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చగల నాయకుడు లంకల దీపక్ రెడ్డి అని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుండగా, అదే విధంగా తెలంగాణలో కూడా బిజెపి గెలిచి ప్రజలకు మంచి పాలన అందించగలదని అన్నారు.బోరబండ డివిజన్లోని సైట్-3 పెద్దమ్మ నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలకగా, వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రజలతో మమేకమై వారి సమస్యలను ఆరా తీశారు. ప్రజలు కమలం పువ్వు గుర్తుపై బటన్ నొక్కి బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని ఘన విజయం సాధింపజేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు దాసరి శంకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి,రమేష్, ఎస్సీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ చిన్న దేవ సహాయం మహిళా నాయకులు శివరంజని, సులోచన, వరలక్ష్మి కూకట్ పల్లి డివిజన్ నాయకులు అనంత నాగరాజు, దుర్గ ప్రసాద్ రావు, బోరబండ డివిజన్ స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.



