

జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి =
భీమారం మండల కేంద్రము లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – భీమారం శాఖలో పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ -(పి ఎ ఐ )1000 రూపాయలతో ఇన్సూరెన్స్ లో పేరు నమోదు చేసుకున్న దుర్గం తిరుపతమ్మ గ్రామం : ఆరెపల్లి , ప్రమాదవశాత్తూ మరణించగా నామిని గా ఉన్నటువంటి ఆమె భర్త దుర్గం తిరుపతి గారికి ఇరువై లక్షల రూపాయల చెక్ , (పి ఎం జె జె బి వై ) -436 ఇన్సూరెన్స్ లో పేరు నమోదు చేసుకున్న మచ్చ విజయ లక్ష్మి ఇటివల మరణించిగా నామిగా ఉన్నటువంటి మచ్చ నరేష్ కు రెండు లక్షల చెక్ ను ఎస్ బి ఐ – మంచిర్యాల రీజనల్ మేనెజర్ రితెష్ కుమార్ గుప్తా ,భీమారం శాఖ కార్యనిర్వహణధీకారి జి. సుబ్బా రెడ్డి , ఎస్ బి ఐ జనరల్ సి ఎస్ ఎం బుచ్చిబాబు, ఐకెపి ఏపిఎం త్రయంబకేశ్వర్ తో కలిసి అందజేసారు , వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ , , పి ఎం ఎస్ బి వై పి ఎం జె జె బివై ఇన్సూరెన్స్ లలో తప్పకుండా పేరు నమోదు చేసుకోవాలనీ, అపత్కాలంలో వారి కుటుంబానీకి ఆర్దిక సహాయంగా తోడుగా ఉపయోగపడుతుందనీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎమ్.అజయ్ , బి .రాజశేఖర్, ఇ.లిఖిత , ఎస్బిఐ జనరల్ బి డి ఎం మహేందర్, సిబ్బంది , ఖాతాదారులు అధీక సంఖ్యలో పాల్గోన్నారు