జనం న్యూస్, అక్టోబర్ 24,అచ్యుతాపురం:
ఉమ్మడి విశాఖ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలం ఎం జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అండర్ 14, 17 బాల బాలికలకు వాలీబాల్, చెస్ క్రీడా పోటీలను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు చేశారని,పాఠశాల స్థాయిలో చదివే విద్యార్థులు తమ చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి కనబరిస్తే మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు. ఇంతమంచి పరిపాలన అందిస్తున్న దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పాఠశాల సిబ్బంది,విద్యార్థులు,కూటమి నాయకులు పాల్గొన్నారు.



