Listen to this article

జనం న్యూస్- అక్టోబర్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన ఆత్మకూరు రామలింగేశ్వర రావు (వయసు 47 ) అనే వ్యక్తి 23 వ తారీఖున ఉదయం 9 గంటల వంశీ కనబడుటలేదని నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై ముత్తయ్య తెలిపారు, కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం 23వ తారీకు ఉదయం తొమ్మిది గంటల సమయంలో పైలాన్ కాలనీ శివాలయం గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తిరిగి ఇంటికి రాలేదని, కుటుంబ సభ్యులు శివాలయం వద్దకు వెళ్లి పరిశీలించగా రామలింగేశ్వర రావు యొక్క ద్విచక్ర వాహనం మరియు చెప్పులను శివాలయం దగ్గర వదిలేసి ఉన్నాయని, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అతని ఆచూకీ కోసం ఎంత వెతికిన ఫలితం లేకపోవడంతో రామలింగేశ్వర రావు భార్య ఆత్మకూరి లక్ష్మి స్థానిక విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక టౌన్ ఎస్ఐ ముత్తయ్య తెలిపారు, ఇట్టి వ్యక్తి యొక్క ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు సమాచారం ఇవ్వగలరని, టౌన్ ఎస్ఐ ఫోన్ నెంబర్ 8712670197 కు సమాచారం ఇవ్వాలని కోరారు.