జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మాతృభూమి సేవా సంస్థ మరోసారి మానవతా విలువలను ప్రతిబింబించింది. ఈరోజు తిరుపతిలో పక్షవాతం వ్యాధితో మంచానికి పరిమితమై ఉన్న దినేష్ కుటుంబానికి పార్వతీపురం నివాసి మణికంర అనే దాతృత్వమున్న వ్యక్తి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమం మాతృభూమి సేవా సంస్థ కార్యదర్శి ఇప్పలవలస గోపాల్ రావు ఆధ్వర్యంలో, దవడ కొండబాబు, మమ్ముల తిరుపతి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా గోపాల్ రావు మాట్లాడుతూ, “సమాజంలో ఇలాంటి సాయం అవసరమైన వారు ఉన్నప్పుడు వారికి చేయూతనివ్వడం మనందరి కర్తవ్యమని” పేర్కొన్నారు.అలాగే మణికంర , “మాతృభూమి సేవా సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి. రాష్ట్ర వ్యాప్తంగా ఆపదలో ఉన్న పది మందికి పైగా కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా సాయం అందించగలగడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.ఈ సందర్భంగా మాతృభూమి సేవా సంస్థ సభ్యులు, సేవా కార్యక్రమాలలో భాగస్వాములైన అందరికీ గోపాల్ రావు ధన్యవాదాలు తెలిపారు.


