

జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి=
.భీమారం: మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం “సూర్య దిశ” తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ (2025) ప్రెస్ క్లబ్ సభ్యులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర కీలకమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తాయని ప్రజా సమస్యలు వెలికితీయడంలో “సూర్య దిశ” బేష్ అన్నారు. పత్రికలు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పని చేస్తాయన్నారు. పత్రికలు ప్రజల పక్షం ఉంటూ ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై పత్రికలు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిని శ్రీకాంత్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి, గౌరవ అధ్యక్షుడు పోగుల మల్లేష్, కోశాధికారి నంది శివకుమార్, జనరల్ సెక్రెటరీ గొల్లపల్లి మహేష్, జాయింట్ సెక్రెటరీ నూతి నాగరాజు, కార్యవర్గ సభ్యులు మంత్రి గజానంద్, నాంపల్లి చంద్రశేఖర్, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు…