Listen to this article

జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )

బహుజన లెఫ్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్లో యార్డులో మొక్క జొన్నలు, వరి ధాన్యాలు షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ఈ సందర్భంగా బి ఎల్ పి పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి ఆంజనేయులు, శివరాత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి సుమారు 20 రోజులు అవుతున్న కింద ఆరా పోసినవి పూర్తిగా ఎండిన తర్వాత మధ్య మధ్యలో వర్షాలు వచ్చి ధాన్యం పూర్తిగా తడిచిపోవడం జరుగుతుంది. అందువల్ల కోరబండ్లు నూకడానికి ట్రిప్పుకు 400 చొప్పున అంటే రోజు ఒక నాలుగు సార్లు కూకడం జరుగుతుంది. అలా ఆరిన తర్వాత మళ్లీ షెడ్ పైకి తీసుకురమ్మని కొనుగోలుదారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ ఆరిన ధాన్యాన్ని అక్కడే కొనాలని అదేవిధంగా గవర్నమెంట్ ధాన్యం రేటు 2400 వందలు ఉండగా ప్రైవే ప్రైవేటు వ్యక్తులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనడంతో రైతులు నష్టపోతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని బి ఎల్ పి పార్టీ నాయకులు రైతులు ప్రభుత్వాన్ని కోరారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున రైతులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవవ్వ ,రమేష్ రాజు ,వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.