Listen to this article

జనంన్యూస్అక్టోబర్ 25.నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము :

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని ఏర్గట్ల మండల పోలీస్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ” ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
బైక్ ర్యాలీ ఉదయం 10:30 గంటలకు ఏర్గట్లఅంబేద్కర్ విగ్రహం నుండి తాళ్ళ రాంపూర్ లో ఉన్న శ్రీ రామాలయం వరకు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మా పోలీస్ సిబ్బది నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు, ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోంటూ నేరాలను అరికట్టడం, మాదక ద్రవ్యాల అణచివేయడానికి, మహిళ భద్రతకు ,తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం అంత సంతోషంగా ఉందన్నారు.ఏ గ్రా మంలోలైనఅసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూస్తామని, ఎక్కడ ఎలాంటి ఆ వంచనీయ సంఘటనలు జరుగటానికి వీలులేదని ఒక అలాంటి సంఘటనలు చోటు చేసుకున్న వెంటనే మాకు సమాచారం అందించాలని కోరారు. మీరు ,పోలీసులు అంటే మేము ఒకే కుటుంబం కానీ మేము వేసుకున్న యూనిఫాం అందరికీ గర్వకారణమని వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు. ఈ దేశం కోసం న్యాయం కోసం ,ఎప్పటికీ తలవంచకుండా. పక్షపాతం లేకుండా, సేవా చేయడానికి మేము ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమములో పోలీస్ సిబ్బంది, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, నూతుల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.