జనం న్యూస్ అక్టోబర్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ లోని ఏ వి బి పురం వెల్ఫేర్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా పెద్దింటి సింహాద్రి, ప్రధాన కార్యదర్శిగా కలమట వెంకట్రావు విజయం పొందారు. వారు టీ పి సి సి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలువగా ఏ వి బి పురం వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలలో గెలుపొందిన వారిని అభినందిస్తూ వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, పి నాగిరెడ్డి, మేకల రమేష్, లక్ష్మయ్య, గోవింద్, ఏవీబీపురం వాసులు ఫల్గుణరావు, చందర్రావు లక్ష్మణరావు పి వెంకట్రావు ఎస్ వెంకట్రావు ఎల్తారకేష్ కే రాము టి ప్రసాద్ ఎస్ జయ రావు పి పాపారావు ఆర్ కుమార్ యు రమణ తదితరులు పాల్గొన్నారు



