Listen to this article

(జనం న్యూస్ చంటి.అక్టోబర్ 27:)

దౌల్తాబాద్: పత్తి రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని హైమద్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రైతులు పత్తికి కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంట నాణ్యత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించి, బారీల సమస్య లేకుండా కొనుగోలు ప్రక్రియ సాగాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎలాంటి దళారీల మోసాలకు గురికావద్దని పిలుపునిచ్చారు.ప్రాంత రైతులు మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రం ప్రారంభం వల్ల తమకు ఎంతో ఊరట లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంతో సరళమైన విధానంలో పత్తి కొనుగోళ్లు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.