జనం న్యూస్ 27 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ
గద్వాల్ జిల్లా గట్టు మండలం : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్రీయ బాల్ స్వాస్థ ఆర్ బి యస్ కే కార్యక్రమం నిర్వహించారు.పుట్టుకతో వచ్చే లోపాలు వ్యాధులు, మరియు అభివృద్ధి ఆలస్యం వంటివి పిల్లలకు ముందుగా గుర్తించి ఉచితంగా ఆర్ బీఎస్ కే ఆధ్వర్యంలో చికిత్స అందిస్తారు. పుట్టుక నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడం దీని లక్ష్యం ప్రాథమిక పాఠశాల ఆరగిద్దలో 250 పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆర్ బీఎస్ కే నోడల్ అధికారి జయరాజు, కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయులు చంద్రకాంత్ వధన్, సద్దాం హుస్సేన్, సౌభాగ్య లక్ష్మి, కృష్ణ ప్రద, బుడ్డన్న, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు


