Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్, 27

గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా తర్లుపాడు మండలం మీర్జా పేట గ్రామ పంచాయితీ కార్యదర్శి కాళంగి శ్రీనివాసులు కీలక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలో క్లోరినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం, మొంత తుఫాన్’ వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు దెబ్బతిన్న భవనాలపై పునరావాస అవగాహన కల్పించారు ఆరోగ్య భద్రతకు క్లోరినేషన్ గ్రామంలో తాగునీటి శుద్ధిలో భాగంగా పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో అన్ని తాగునీటి వనరులు, పైప్‌లైన్‌ల వద్ద క్లోరినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. వర్షాకాలం, తుఫానుల నేపథ్యంలో నీటి కాలుష్యం పెరగకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు శుభ్రమైన తాగునీటిని మాత్రమే వినియోగించాలని, దీనివల్ల డయేరియా వంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చని కార్యదర్శి వివరించారు. మొంత తుఫాన్ కారణంగా దెబ్బతిన్న మట్టి భవనాల పరిశీలన: తుఫాన్ కారణంగా దెబ్బతిన్న మట్టి భవనాలు మరియు శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కార్యదర్శి బృందం స్వయంగా సందర్శించింది. ఈ ఇళ్లలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు మారాలని, బలహీనంగా ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ దర్బాసుల మీరయ్య, పెసల వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్స్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు