జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
కడపలోని మాంటిస్సోరి జగతి ఇంటర్నేషనల్ స్కూల్ నందు జరిగిన అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల వాలీబాల్ పోటీల్లో నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. యేసుప్రియ మరియు బి. నక్షత్ర అండర్ 14 విభాగంలో వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు, వీరిరువురు నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో త్వరలో పాల్గొంటారు…అలాగే అండర్ 17 విభాగంలో కే.శివ మంజులకూడా వాలీబాల్ పోటీలకు ఎంపిక కాబడింది మరియు త్వరలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన బోతోంది. ఈ సందర్భంగా నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు జి.మాధవి లతమాట్లాడుతూ, అండర్ 14 మరియు అండర్ 17 విభాగాలలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలవిద్యార్థినీలు ఎంపిక కావడం చాలా సంతోషంగాఉందని,భవిష్యత్తులో జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుతూ ఎంపికైన విద్యార్థినీ లను ఘనంగా అభినందించి, వారికి అంతా మంచే జరగాలని ఆకాంక్షిం చారు.ఈ యొక్క కార్య క్రమంలో పాఠశాల పిడి యం.సుస్మిత, పిఈటి పి.జగన్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.


