జనం న్యూస్ అక్టోబర్ 27 నడిగూడెం
ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించిన, మైనర్లకు వాహనాలు ఇచ్చిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై జి.అజయ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం పాత్రికేయులతో మాట్లాడుతూ
పిల్లల పట్ల ఎప్పటి కప్పుడు తల్లీదండ్రులు అప్రమత్తతో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, ఆటోలలో పరిమితికి మించిన ప్రయాణికులు ఎక్కించరాదని తెలిపారు.గూడ్స్ ఆటోలలో సుమారుగా 30 మంది ప్రయాణికులను ఎక్కిస్తున్నారని అటువంటి ఆటోల పై కేసు నమోదు చేస్తామన్నారు. పిల్లలకు అతిగారభంతో లక్షలరూపాయలు వెచ్చించి టు వీలర్ వాహనాలు, కార్లు, సెల్ ఫోన్లు, అప్పు చేసి కొనేటంతో వారికి తల్లిదండ్రుల కష్టం విలువ తెలియకుండా గంజాయి, మత్తు సిగరెట్లు పాన్ అలవాటే మితిమీరిన వేగానికి కారణమై ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని,ఆ ప్రమాదంలో అతను కూడా చనిపోవడం జరుగుతుందని, దింతో ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు.


