జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన మండలం చిర్ర యానం సైక్లోన్ షెల్టర్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మెoథ తుఫాను నేపథ్యంలో ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చిర్ర యానం సైక్లోన్ షెల్టర్ను స్థానిక శాసనసభ్యులు మరియు ఎంపీ ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా వారు గ్రామస్తులు అధికారులకు వివిధ సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశానుసారం క్షేత్రస్థాయిలో తుఫాను సహాయ చర్యలు అందించడంలో ఎవరు వెనకడుగు వేయమని అదే విధంగా ప్రజలు కూడా సహకరించి ముందుగానే ఈ తుఫాను తీవ్రత దృష్ట్యా సైక్లోన్ షెల్టర్లు యందు సురక్షితంగా ఉండాలని మత్స్యకారులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్లరాదని పేర్కొన్నారు.
అదేవిధంగా అధికారులకు సురక్షిత తాగునీరు ఆహారం విద్యుత్ సరఫరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిక్షణం పరిస్థితుల సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
నియోజవర్గ మరియు మండల అధికారులు ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శులు నాగిడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, చెల్లి అశోక్ నడింపల్లి సుబ్బరాజు,,చెల్లి సురేష్, , ఆకాశం శ్రీనివాస్,,విత్తనాల బుజ్జి
కూటమి కార్యకర్తలు నాయకులు అనుక్షణం ప్రజలతో మమేకమై వారి కి ఆసరాగా ఉండాలని పేర్కొన్నారు.



