Listen to this article

జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

“మొంథా” తుఫాను నేఫధ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపిఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తన క్యాంపు కార్యాలయం నందు అందుబాటులో ఉండే పోలీసు అధికారులతో తుఫాను పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ మాటలాడుతూ. “మొంథా” తుఫాను కాకినాడ- మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తుఫాను తీరండాటే సమయంలో జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కావున, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం వాటిల్లకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టా లన్నారు. పోలీసు అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపాల్టీ, విద్యుత్, రెవిన్యూ, మెడికల్ వంటి అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులకు దిశా నిర్దేశం చేసారు. సోషల్ మీడియాలో అవాస్తపు వార్తలను పోస్టు చేసే వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, ఎఆర్ డిఎస్పీ ఈ. కోటిరెడ్డి, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, పోలీసు కంట్రోల్ రూం సిఐ వైకుంటరావు, ఎంటి ఆర్.ఐ.రమేష్ కుమార్ మరియు కొంతమంది ఎస్.ఐ.లు పాల్గొన్నారు.
.