జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మొంథా తుఫానుతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రజలకు సహాయక చర్యలు, రక్షణ చర్యలు చేపడుతుం టే, మరోవైపు కొంతమంది వ్యక్తులు తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు కట్టలు తెగిపోయి వరదలు వస్తాయని పనిగట్టుకొని అవాస్తవాలతో దుష్ప్రభావం చేస్తున్నారని అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అక్టోబరు 28న హెచ్చరించారు.జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ మొంథా తుఫానుతో ఒకవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, సహాయక కేంద్రాలకు తరలిస్తుంటే కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్టు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని జిల్లా ఎస్పీ అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా అబద్ధాలను ప్రచారం చేయడం వలన ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారన్నారు. చెరువులకు గండ్లు పడ్డాయని, కట్టలు తెగిపోయి గ్రామాల్లోకి వరదలు వచ్చేస్తున్నాయి అని, సహాయక కేంద్రాల్లో డబ్బులు ఇస్తున్నారని వాటి అవాస్తవాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. ఇటువంటి వ్యక్తులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. తుఫాను హెచ్చరికలతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అన్ని ముందస్తు చర్యలు, జాగ్రత్తలు చేపట్టారని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. దురుద్దేశంతో తప్పుడు వార్తలను ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ హెచ్చరించారు.హెచ్.


