జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఈరోజు విజయనగరం, ధర్మపురి లోని పతివాడ వీధిలో శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపు ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ సోమవారం సాయంత్రం గం!! 05.00 లకు శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపనా ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచా గ్రవ్య ప్రాసన, పరిషత్ గోపూజా తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, ముఖ్యనాయకులు, గ్రామ ప్రజలు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.


