జనం న్యూస్ అక్టోబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా తుఫాన్ ప్రభావంతో ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం భైరవపాలెం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వసతులను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తో కలిసి పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండటంతో పాటు అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాల్లోనే నివాసం ఉండాలని కోరారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి అవసరమైతే తగిన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భోజన వసతిని ఎంపీ హరీష్ పరిశీలించారు.


