భద్రాద్రి కొత్తగూడెం,క్రైం అక్టోబర్ 28:( జనం న్యూస్)
సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలను బహిర్గతం చేయడంలో ఎలాంటి మినహాయింపులు లేవని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు డా. మారెల్లి విజయ్ కుమార్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో తమ ఆస్తులను వెల్లడించాల్సి ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజా సేవకులుగానే పరిగణించబడతారని ఆయన పేర్కొన్నారు.2009లో మాజీ కేంద్ర సమాచార కమిషనర్ శైలేష్ గాంధీ ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తి వివరాలు “వ్యక్తిగత గోప్యత” కింద రక్షించబడవని, వాటిని ప్రజలకు అందించవచ్చని చెప్పారు. తాజాగా మద్రాస్ హైకోర్టు (2024) కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు, అప్పులు “ప్రైవేట్ సమాచారం” కాదని స్పష్టం చేసిందని తెలిపారు.పారదర్శకత, అవినీతి నిరోధానికి ఇది దోహదం చేస్తుందని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన ఆస్తులు, అప్పులను నిజాయితీగా ప్రకటించాలని డా. విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


