జనం న్యూస్ అక్టోబర్ 28 నడిగూడెం
మండలం లోని రత్నవరం,సిరిపురం, వల్లాపురం తదితర గ్రామాలలో ‘మొంథా’ తుఫాను ధాటికి వరిపొలాలు పూర్తిగా నేలకొరిగాయి. పొట్ట, కంకి దశలో ఉన్న పంట నష్టంతో ఎకరాకు పెట్టిన రూ.30 వేల పెట్టుబడి కూడా తిరిగి వస్తుందో రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


