జనం న్యూస్ అక్టోబర్ 28 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్)
ఎల్కతుర్తి.. సమయస్ఫూర్తితో యువకుని ప్రాణాన్ని కాపాడిన పోలీస్ సిబ్బంది. వివరాల్లోకి వెళితే, చింతలపల్లి గ్రామానికి చెందిన లొల్లేటి విశ్వతేజ 18 సంవత్సరాలు, భూ బదలాయింపు విషయంలో, తమకు న్యాయం జరగడం లేదంటూ, చింతలపల్లి లోని వాటర్ ట్యాంక్ ఎక్కి, పెట్రోల్ మీద పోసుకొని అంటించుకోవడానికి ప్రయత్నం చేయగా, సంఘటన స్థలానికి వెళ్లిన ఎస్సై అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్, సిబ్బంది బక్కయ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి లు గంటపాటు బుజ్జగించి వాటర్ ట్యాంక్ నుండి దిగేలా చేశారు. అనంతరం ఎస్సై యువకున్ని తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అతని తల్లి ఆరుణకు అప్పగించారు. యువకుని ప్రాణాన్ని కాపాడిన, ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది వెంకటరెడ్డి, బక్కయ్యలను, భాస్కర్ రెడ్డి, లను సీఐ పులి రమేష్ అభినందించారు. మండల ప్రజలు సైతం పోలీసుల పట్ల హర్షం వ్యక్తం చేశారు.



