జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
జిల్లాలో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లా నుంచి పూసలు అమ్మటానికి వచ్చిన 13 మంది వలసదారులకు అధికార యంత్రాంగం రక్షణ కల్పించింది. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ సమాచారం మేరకు సిబ్బంది పునరావాసం కల్పించారు.బాబామెట్టలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో వారికి తాత్కాలిక నివాసం, ఆహారం, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.


