Listen to this article

జనంన్యూస్. 29.సిరికొండ. నిజామాబాదు.

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఐదుగురు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినాల శ్రీకాంత్ మాట్లాడుతూ రక్తదానం-మహాదానం అని ఒకరి రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడగలదాని,రక్తదానం వల్ల ఇతరులకు ప్రాణాపాయం నుంచి కాపాడటంతో పాటు, దాత ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రక్తదానం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది, కేలరీలు ఖర్చవుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని తాను ఇప్పటివరకు 11 సార్లు రక్తదానం చేశానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాతలుగా శ్రీకాంత్,వినోద్,రాజేందర్,సుదర్శన్,శేఖర్ పాల్గొన్నారు.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిరికొండ ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.