Listen to this article

జనం న్యూస్ 29/10/2025హయత్ నగర్

నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది కావున అన్ని మండల కేంద్రాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, చెరువులు. దగ్గరికి వెళ్ళకూడదు రైతన్నలు స్తంభాలను,కరెంట్ తీగలను, మరియు ట్రాన్స్ఫార్మర్లను తాకవద్దు
డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్లపై వెళ్లేటప్పుడు మ్యాన్ హోల్స్ మరియు డ్రైనేజీలను గమనించండి
ఉదృతంగా ప్రవహించే చెరువులు వాగుల వద్దకు వెళ్ళకండి ముఖ్యంగా కూలిపోయి స్థితిలో ఉన్న పాత ఇంట్లో మరియు పాత గోడల పక్కన ఉండకండి వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడడం కానీ కూర్చోవడం కానీ చేయవద్దు పిడుగు పడే అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు గమనించగలరు చిన్నపిల్లల్ని వర్షం పడుతున్నప్పుడు ఆరు బయట ఆడుకోవడానికి పంపించొద్దు జాగ్రత్తలు పాటించండి…. క్షేమంగా ఉండండి
మీ ఆలంపల్లి దుర్గేష్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్