జనంన్యూస్. 29.సిరికొండ.
నిజామాబాదు రురల్ సిరికొండ, గడ్కోల్ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి -హుస్సేన్ నగర్ సర్వేనెం.836 సీలింగ్ లో భూములను కబ్జాలో ఉన్న పేదలకు ఇవ్వాలి.సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ డిమాండ్ సిరికొండ, గడ్కోల్ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని.
బుధవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో పార్టీ కార్యలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు: సిరికొండ సర్వేనెం.532, గడ్కోల్ సర్వేనెం. 100 గల భూములను పేదలు ఆక్రమించి, పట్టాలు పొంది సంవత్సరాలు గడుస్తున్న పరిష్కారం కావడం లేదన్నారు.
లబ్దిదారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన అటవీశాఖ అధికారులు దున్నపోతుపై వడగండ్ల వాన పడ్డట్టు వ్యవహారిస్తున్నారు అన్నారు. పేదల భూములను అందులో పట్టాలు పొందిన భూములను తమ భూములని పచ్చగున్నాయ్ అన్నికూడ అటవీభూములే అన్నట్టుగా మొండిగా, ఏకపక్షంగా కంధకాలు త్రవ్వి అక్రమించుకోవడం సిగ్గుచేటు అన్నారు. పేదలు పట్టాలు పొందిన వాటికీ రావడం దారుణం అన్నారు. సీలింగ్ కింద ప్రభుత్వం తీసుకున్న హుస్సేన్ నగర్ సర్వేనెంబర్ 836 లో ప్రస్తుతం ధరణి వచ్చాక పాత దొరల సమయంలాగా తప్పుడు రికార్డ్ లను సృష్టించి మళ్ళీ విలువైన భూమాలను కబ్జా చేయడానికి పైరవికారులు ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఒక వ్యక్తి లేదా కుటుంబం 54 ఎకరాలకు మించి భూములు ఉండకూడదు అని కానీ ఈ భూములు ఎలా ఓకే వ్యక్తిపై 280 ఎకరాలు ఎలా రికార్డ్ చేశారు అన్నారు. సీలింగ్ యాక్ట్ చెసే అధికారులు చోధ్యం చూస్తున్నారని, ఎందుకు పరిశీలించి చర్యలు తీసుకోవడం లేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చాక అటవీ, రెవిన్యూ భూముల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి అన్నాడు. ఇచ్చిన అన్ని హామీలు లాగా అటవీభూముల సమస్యను విస్మరిస్తే కేసీఆర్ లాగా ప్రజలు తీస్కరిస్తారు అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు అసైన్డ్ భూమాల సెటిల్మెంట్ కమిటీ వేశారు అని ఇప్పటి కైన పరిష్కారం దిషగా అలోచించాలి అని కోరారు. పేస్ మీట్ లో సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు ఆర్. రమేష్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు బి. కిశోర్, ఎం. అనిస్, జి. కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


