ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచన..
ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు..
జనం న్యూస్, అక్టోబర్ 29, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్
రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావం మరో రెండు రోజులు కొనసాగనున్న నేపథ్యంలో చలి గాలులు, వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సూచించారు.ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో పత్తి, వరి రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ శాఖ సూచనలను కచ్చితంగా పాటించాలని, ఐకెపి మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్ఫలిన్ కవర్లు సమృద్ధిగా అందజేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు కూడా సూచించినట్టు ప్రణవ్ తెలిపారు.


