మత్స్యకారుల సంఘం అధ్యక్షులు- రమణ
జనం న్యూస్- అక్టోబర్ 29- నాగార్జునసాగర్ టౌన్ –
నాగార్జునసాగర్ లో తుఫాను ప్రభావంతో కృష్ణా నదిలో గల్లంతైన మత్స్యకారుల వలలు, పడవలు. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మొంథా తుఫాను ప్రభావంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కృష్ణమ్మ అలలు భారీగా ఎగిసపడడంతో మంగళవారం సాయంత్రం నుంచి కృష్ణ నదిలో చేపల వేటకు వెళ్లేందుకు వీలు కాకపోవడంతో బుధవారం సాయంత్రం నది ప్రాంతం వద్దకు వెళ్లి చూడగా నదిలో చేపల కోసం వేసిన వలలు అలాగే నది ఒడ్డున పెట్టిన వలలు, పడవలు, మర బోట్లు గల్లంతయినట్లు తెలిపారు,ఈ సందర్భంగా నాగార్జునసాగర్ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు రమణ మాట్లాడుతూ నాగార్జునసాగర్ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో చేపల వేట చేస్తూ సుమారు రెండు వేల మంది మత్స్యకారులు జీవనం కొనసాగిస్తున్నారని,ఈ ఏడాది లో ఆగస్టు నెలలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో ఆ వరద తాకిడికి మత్స్యకారుల వలలు, పడవలు కృష్ణానదిలోగల్లంతయ్యాయి,
మంగళవారం సాయంత్రం వచ్చిన మొంథా తుఫాను కారణంగా మరోసారి భారీగా వలలు, పడవలు అలల తాకిడికి గల్లంతయ్యాయి అని అన్నారు.ఈ ఏడాదిలో రెండుసార్లు వలలు, పడవలు గల్లంతు కావడంతో మత్స్యకారులు తీవ్ర నష్టానికి గురయ్యామన్నారు,ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, మత్స్యశాఖ అధికారులు స్పందించి నష్టపోయిన మత్స్యకారులకు వలలు, పడవలు అందించి మా మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు,ప్రతి ఏడాది కృష్ణానదిలో మత్స్యకారులు వలలు, పడవలు కోల్పోతున్నారని,గత ఏడాదిలో మత్స్యకారుల సంగం ఇంజన్ బోటు నదిలో గల్లంతయినట్లుగా మత్స్యశాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఎలాంటి స్పందన లేదు,కనీసం ఈసారైనా మా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలి అని ఆయన అన్నారు,వలలు, పడవలు కోల్పోయిన మత్స్యకారులు ముసలయ్య,అప్పలరాజు, సత్యరావు,రాజు,నాగరాజు,దేవుడుయేసు,మసేను,రాజు,కాషరావు, రాజారావు,కొండ,శివ,శ్రీను,తదితరులు పాల్గొన్నారు.


