జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి దేవరపల్లి : మండలంలోని రైవాడ జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 112.97 మీటర్లకు చేరుకుంది. రైవాడ జలాశయం గరిష్ట నీటి మట్టం 114.00 మీటర్లు కాగా, ప్రస్తుతం జలాశయానికి వస్తున్న వరద నీటి ప్రవాహం (ఇన్ఫ్లో) సుమారు 12,000 క్యూసెక్కులుగా నమోదైంది. దీని ఫలితంగా, అధిక నీటి మట్టం కారణంగా జలాశయం స్పిల్వే ద్వారా మూడు గేట్లు తెరచి సుమారు 12,000 క్యూసెక్కుల నీటిని శారదా నదిలోకి విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, జలాశయం దిగువన ఉన్న గ్రామాలు మరియు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని సందర్భాలలో నది పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అలాగే, స్థానిక పోలీసులు, రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రతే ప్రాధాన్యమని జిల్లా పోలీసులు తెలియజేస్తున్నారు.//


