జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మొంత తుఫాన్ కారణంగా గత మూడు రోజులు గా కురుస్తున్న వర్షాలు పడటం వలన లోతట్టు ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆదేశాలను కూటమి నాయకులు ఈరోజు 82 వ వార్డు శారదా నది గొట్టుకు అనుకొని ఉన్న శ్రీరాంనగర్ అంజయ్య కాలనీ సందర్శించి అక్కడ వరదకు గురికాకుండా శారదా నది పక్కనున్న కుటుంబాల్ని సురక్షితమైన ప్రాంతాలకి వెళ్లడానికి అవగాహన కల్పించి అక్కడ ఏర్పాట్లు వివరించి తరలించడం జరిగినదని ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు తెలియజేశారు. రైవాడ జలాశయం నుండి తుఫాను వల్ల కురిసిన వర్షాలకి భారీగా నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తు వేయడం వల్ల భారీగా నీరు శారదా నదిలో ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా అంజయ్య కాలనీ, శ్రీరామనగర్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి అనకాపల్లి డిఎస్పి శ్రావణి అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి తహసిల్దార్ శాంతిభూషణ్ తదితరులు ఈరోజు ఉదయం ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు తుఫాను వల్ల ఏర్పడిన ఇబ్బందులు వివరించి అక్కడ నివాసం ఉన్న వారందరిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని రామచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అప్పికొండ గణేష్ బర్నికాను రాము కసిరెడ్డి వాసు ఆరుగుళ్ళు అర్జున్ ఈతలపాక మంగరాజు పెద్దడా దుర్గారావు ముప్పిడి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.//


