Listen to this article

కల్లూరు టు పుల్లయ్య బంజరు ప్రధాన రహదారి పై నేలకొరిగిన వృక్షం

చండ్రుపట్ల లో పాక్షికంగా కూలిన పెంకుటిల్లు

పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం

జిడిపి పల్లి గ్రామంలో పాక్షికంగా దెబ్బతిన్న రెండు పెంకుటిల్లు

జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో అక్టోబర్ 29

మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలో పలు గ్రామాల్లోని ప్రధాన రహదారుల పై వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఇకపోతే మండలంలోని తాళ్లూరు టు వెంకటాపురం గ్రామాల మధ్యన గల ఊర చెరువు వాగు పొంగి ప్రవహిస్తుంది ప్రధాన రహదారి పైన గల చెప్తా పై నుంచి వరద నీరు భారీగా ప్రవహించడంతో ఆయా గ్రామాల రాకపోకులకు తీవ్ర అంతరాయం కలిగింది దీంతో మండల ఎంపీవో రాజారావుతో పాటుగా పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని రాకపోకలను ఇరు ప్రక్రియ ట్రాక్టర్ల సహాయంతో పూర్తిస్థాయిలో నిలిపివేశారు అదే విధంగా కల్లూరు టు పుల్లయ్య బంజరు ప్రధాన రహదారి పై బుధవారం తెల్లవారు జామునఈదురు గాలులతో ఓ వృక్షం నేల వాలడం తో పలు గ్రామాలకు రాకపోకులకు అంతరాయం కలిగింది అంతే కాకుండా రహదారి పై నేలకొరిగిన వృక్షాన్ని కల్లూరు మున్సిపాలిటీ మేనేజరు నందిశెట్టి నాగేశ్వరరావు సమక్షంలో ప్రత్యేకంగా డోజర్ యంత్రంతో అట్టి వృక్షాన్ని తొలగించారు ఇక మండలంలో చండ్రుపట్ల జిడిపి పల్లిలో రెండు పెంకుటిల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఇకపోతే కల్లూరు పెద్ద చెరువు అలుగు నీరు ప్రధాన రహదారి పై ప్రవహించడంతో కల్లూరు టు లక్ష్మీపురం గ్రామాలకు కూడా రాకపోకులకు అంతరాయం కలిగింది మండల స్థాయిలో ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ క్రింది స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రజలకు తుఫాను హెచ్చరికలు సమాచారం అందించారు.