జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కొత్తవలస మంగలపాలెం సాయి నగర్ కాలనీ ఎంపీపీ స్కూల్ దేశపత్రునిపాలెం *సుపథ పరీక్షకు సాయి నగర్ కాలనీ ఎంపీపీ స్కూల్ నుండి ఐదుగురు విద్యార్థులు ఎంపిక చేయడం జరిగింది. వారిలో ఇద్దరు పిల్లలు హాజరు కాలేదు మిగిలిన ముగ్గురు విద్యార్థులు సూపధ ప్రతిభ పరీక్ష లో పాల్గొనడం జరిగింది వారికి ఐదు విభాగాలలో పరీక్షను నియమించడం జరిగింది ప్రతీ విద్యార్థి వర్ణమాల, ఒక గుణింతం, తెలుగు అంకెలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు. ఇందులో లలితా శ్రావణి మూడో తరగతి విద్యార్థిని తెలుగు తెలుసుకుందాం విభాగంలో నైపుణ్యం ఘనపరిచింది. మరియు లలితా లాస్య లహరిక ఐదో తరగతి విద్యార్థిని పద్యం శ్లోకం తెలుగు తెలుసుకుందాం విభాగాల్లో నైపుణ్యతను ఘనపరిచారు. నాలుగవ తరగతి విద్యార్థిని అర్పిత పద్యాలు మరియు తెలుగు తెలుసుకుందాం విభాగాలలో ప్రతిభను ఘనపరిచారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులైన కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో అదే కాక సుపథ న్యాయ నిర్ణీతల ఆధ్వర్యంలో పాటిస్పేట్ బహుమతులను కూడా ఇవ్వడం జరిగింది. ఉదయం 9:30 నుండి ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరిగింది.


