Listen to this article

జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

నెల్లిమర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్ల కేజీబీవీ విద్యార్థులను జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు బుధవారం పరామర్శించారు. పాఠశాలలో జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురై, చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వారిని పరామర్శించిన ఛైర్మన్‌ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.