Listen to this article

మొంథా తుఫాన్ ప్రభావం వలన పీఏ పల్లి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల డిస్ట్రిబ్యూటరీ 7-B కెనాల్ లోకి ఎగువ చెరువులో గల నీరు చేరడం వల్ల కెనాల్ ఉప్పొంగి పోతిరెడ్డిపల్లి గ్రామం లోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరడం వల్ల సుమారు 10 కుటుంబాలు, వరి పోలాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి, గ్రామంలోని నాలుగు కుటుంబాలకు చెందిన ప్రజలను గ్రామ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలొ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి తగు వసతులు కల్పించడం జరిగినది మరియు సంబంధిత గ్రామ పాలన అధికారిని పునరావాస కేంద్రం వద్ద నియమించి వారికీ తగు సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేయనైనది. పునరావాస కేంద్రంలో నిర్వాసితులు బోగోజు రామాచారి, కృష్ణయ్య, బోగోజి కృష్ణవేణి, దివ్య, వైష్ణవి, శివ సాయి చారి మరియు చిత్రీయాల మల్లమ్మ, ప్రేమ్ కుమార్,సరస్వతి, మరియు కోరె మల్లమ్మ,కోరి శివ,మడారి రామచంద్రం, మాడారి కమలమ్మ గార్లకు పునరావాస కేంద్రం యందు వసతులు ఏర్పాటు చేయనైనది…. ఇట్లు తహసీల్దార్ పి ఏ పల్లి మండలం