జనం న్యూస్,అక్టోబర్ 30,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కుమ్మరాపల్లి,రజాల ప్రాంతంలో శారదా నదికి గండి పడి గట్టు తెగిపోవడంతో ఒక్కసారిగా వరద నీరు పొలాల్లోకి ప్రవహించింది. దీంతో వరి పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. అలాగే చేపలు, రొయ్యల చెరువులు కూడా నష్టం వాటిల్లింది.అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గట్టు తెగిన ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


