జనం న్యూస్, అక్టోబర్ 30,ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మానవ సేవతో పాటు విద్యా అభివృద్ధి రంగంలో విశిష్ట కృషికి గుర్తింపుగా పుదుచ్చెరిలో ఘనంగా జరిగిన అవార్డు వేడుక తరువాత జగిత్యాల కు విచ్చేసిన సందర్భంలో ప్రముఖ విద్య వేత డాక్టర్ గంప విజయ్ కుమార్ వారికి స్వాగతం పలికారు తరువాత వారిని ఘనంగా సన్మానించారు గంప విజయ్ కుమార్ మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పుదుచ్చెరిలో నిర్వహించబడిన లైఫ్లైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఫంక్షన్లో ప్రముఖ విద్యా మరియు సేవామూర్తి ప్రగల్లపాటి కనకరాజు విద్యా విభాగంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ ఘన సమారోహం సమాజ సేవ, విద్యా సేవా స్ఫూర్తి, వాసవి ధర్మతత్త్వాల సమ్మేళనంగా నిలిచింది అని అన్నారు ఈ కార్యక్రమానికి పుదుచ్చెరి రాష్ట్ర ముఖ్యమంత్రి థిరు ఎన్. రంగస్వామి ముఖ్య అతిథిగా హాజరై అవార్డును స్వయంగా ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ “విద్యా విభాగంలో ప్రగల్లపాటి కనకరాజు సేవలు వాసవి తత్త్వానికి ప్రతిరూపం. విద్యారంగం ద్వారా సమాజ నిర్మాణానికి సేవ చేసిన వీరి కృషి ప్రశంసనీయమైంది” అన్నారు. పుదుచ్చెరి పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి థిరు కె. లక్ష్మీనారాయణన్ గౌరవ అతిథిగా హాజరై “విద్య అంటే కేవలం పాఠశాలలకే పరిమితం కాదు, అది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శక్తి. ఆ శక్తిని సమాజ సేవలో మలచిన వ్యక్తి ప్రగల్లపాటి కనకరాజు” అని అన్నారు. ఈ వేడుకకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు విఎన్. డైమండ్ కేజీసీఎఫ్ ఎరుకుల్ల రామకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ “విద్యా విభాగంలో సేవ చేయడం అంటే భవిష్యత్ తరాలకు వెలుగు పంచడం. కనకరాజు ఆ వెలుగు ప్రసారకులు. వాసవి మాత ధర్మ బోధనలతో ఆయన నడిపిన సేవా యాత్ర అందరికీ ఆదర్శం” అన్నారు. ఈ కార్యక్రమంలో విఎన్. సేవా సంకల్ప కేజీసీఎఫ్ సిద్ధ సూర్య ప్రకాశరావు (అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), విఎన్. ప్రతిభా సంకల్ప కేజీసీఎఫ్ గర్లపాటి శ్రీనివాసులు (అంతర్జాతీయ కార్యదర్శిపరిపాలన), విఎన్, ప్రోగ్. ప్రతిభా సంకల్ప కేజీసీఎఫ్ బోడ సాయి సూర్యప్రకాశ్ (అంతర్జాతీయ కార్యదర్శి సేవలు), విఎన్. విద్యా సంకల్ప కేజీసీఎఫ్ సుజాతా రమేష్ బాబు (అంతర్జాతీయ ఖజానాదారు 2025), విఎన్. సిల్వర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అవార్డుల కమిటీ అధ్యక్షుడు విఎన్. డైమండ్ కాదవెందీ శ్రీనివాస్ కూడా హాజరై అవార్డు గ్రహీతకు అభినందనలు తెలిపారు. అవార్డును స్వీకరించిన అనంతరం ప్రగల్లపాటి కనకరాజు మాట్లాడుతూ “ఈ గౌరవం నాకు లభించిందంటే అది నా వ్యక్తిగత విజయమే కాదు, వాసవి మాత ఆశీస్సులతో విద్యారంగంలో సేవ చేస్తున్న ప్రతి వాసవియనుడి కృషికి గుర్తింపు. విద్యే సేవకు ప్రథమ పునాది. విద్య ద్వారా మనిషి మారితే సమాజం మారుతుంది. సేవే మన పూజ, ధర్మమే మన దారి” అని అన్నారు. వాసవి క్లబ్స్ సభ్యులు, విశిష్ట అతిథులు, సేవాస్ఫూర్తి గల వాసవియన్లు పాల్గొన్న ఈ వేడుకలో విద్యా, సేవా విలువల సమ్మేళనం సజీవంగా ప్రతిఫలించింది. పుష్పాలతో అలంకరించిన వేదికలో వాసవి మాత తత్త్వ స్ఫూర్తి ప్రతిధ్వనించింది. ఈ పురస్కారం ప్రగల్లపాటి కనకరాజు గారి జీవితానికి కొత్త వెలుగు, నూతన ప్రేరణను అందించింది. విద్యా సేవా రంగంలో ఆయన కృషి యువతకు మార్గదర్శిగా నిలుస్తోంది.. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విద్యా మరియు సేవా విభాగాల్లో అచంచలంగా కృషి చేస్తున్న ఇలాంటి మహనీయుల గుర్తింపే వాసవి ఉద్యమానికి బలం, సమాజానికి దిశ.



