Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి

మొంథా తుఫాను ప్రభావం వరి రైతులపై అధికంగా పడిందని, ఉద్యాన, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం వ్యాఖ్యానించారు. గురువారం కొత్తపేట మండలం కొత్తపేట బొరుసు వారి సావారం లో కొత్తపేట మండల బీజేపీ అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తో కలసి పాలూరి సత్యనందం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు పర్యటించి అన్నదాతల ఇక్కట్లను పరిశీలించారు. పంట కోతకు వచ్చే సమయానికి తుఫాన్ రావడంతో వరి పొలాలు నేలనంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందుతుందన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నమోదు చేసి పరిహారం అందేలా చేస్తారని వారికి తెలియజేశారు. వరి ఎకరాకు రూ.8వేలు, అరటి ఎకరానికి రూ.14వేలు, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారంగా అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని తెలియజేశారు. కర్షకులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయ ప్రకాష్ నారాయణ, కోటిపల్లి దామోదర్, గొనె మడతల కనకరాజు, అన్యం సత్యనారాయణ, వలపశెట్టి కిరణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.