Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 30

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి, బీజేపీ అభ్యర్థి శ్రీ లంకల దీపక్ రెడ్డి కి మద్దతుగా గురువారం శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు ప్రజల కోసం ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు.ఎన్నికల ముందు సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం, మంత్రులు హడావుడిగా ప్రచారం చేయడం ఇవి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనమన్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లకు గుణపాఠం చెప్పే మంచి అవకాశం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భారత్, సీనియర్ నాయకురాలు రామ పద్మా రెడ్డి, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.