Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 31

తర్లుపాడు మండలం, కలుజువ్వలపాడు గ్రామంలో వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునీకరించే దిశగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కీలక అడుగు వేశారు. ఈ సందర్భంగా, కలుజువ్వలపాడులో రైతులకు వ్యవసాయ డ్రోన్‌ను పంపిణీ చేశారు.ఈ డ్రోన్‌ను వ్యవసాయ శాఖ ద్వారా కోదండరామస్వామి గ్రూప్‌కు అందజేశారు. పంటలపై పురుగుమందులు పిచికారీ చేసుకోవడానికి వీలుగా దీనిని కేటాయించారు. ఈ డ్రోన్ విలువలో, ప్రభుత్వం ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీని అందించడం విశేషం.ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం వల్ల తక్కువ సమయంలో, సమర్థవంతంగా పురుగుమందుల పిచికారీ చేయవచ్చని, ఇది శ్రమను, ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ డి ఏ మార్కాపురం బాలాజీ నాయక్, మండల వ్యవసాయ అధికారి జ్యోష్ణ దేవి, కె వి కె శాస్త్రవేత్త రమేష్, ఏ ఈ ఓ దేవేంద్ర గౌడ్, వి హెచ్ ఏ సుస్మిత టిడిపి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు