Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం అక్టోబర్ 31

మొంథా తుఫాను బీభత్సం కారణంగా సర్వం కోల్పోయి, తీవ్రంగా ప్రభావితమైన ఓ బాధితుడికి ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండల తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ మానవతా దృక్పథంతో చేయూతనిచ్చి ఆదుకున్నారు. తర్లుపాడు మండల కేంద్రంలోని పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాధితుడికి ఆయన స్వయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.మానవత్వంతో స్పందించిన తహసీల్దార్
పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న గుంటు యేసు అనే బాధితుడి పరిస్థితి తెలుసుకున్న తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్, వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఆయన స్వయంగా పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితుడిని పరామర్శించి, అతనికి కావాల్సిన సరుకులు 25 కేజీల బియ్యం (రైస్) నిత్యావసర సరుకులు (పప్పులు, నూనె, ఉప్పు వంటివి)కూరగాయలు తహసీల్దార్ కె కె కిషోర్ కుమార్ అందజేశారు తహసీల్దార్ అందించిన ఈ చేయూత, తుఫాను కారణంగా నష్టపోయిన బాధితుడికి తక్షణ ఉపశమనాన్ని కలిగించింది. విపత్కర పరిస్థితుల్లో అధికారి చూపిన ఈ ఔదార్యం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈకార్యక్రమంలో లో రెవిన్యూ సిబ్బంది ఆర్ ఐ శ్రీ చరణ్, వి ఆర్ ఏ లు సిహెచ్ చెన్నయ్య, బి సుబ్బయ్య పాల్గొన్నారు