 
									 
జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రైళ్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని రైల్వే జి ఆర్ పి పోలీసులకు విశాఖపట్నం రైల్వే లైన్స్ సీఐ రవికుమార్ సూచించారు.విజయనగరం జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో రికార్డులు పోలీసులు పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలపై రైలు ప్రయాణికులకు అవగాహన కల్పించాలని, ప్రయాణికులు భద్రతపై సూచనలు చేశారు.


