 
									 
జనంన్యూస్. 31.సిరికొండ.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల రైతల తరపున నిజామాబాదు కలెక్టర్ కి భూక్యా గంగాధర్ విన్నపం
మండలంలో నాలుగు రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షం కురిసినది రైతులు వారి పంట కోసి కల్లాల వద్ద వడ్లను ఎండబెట్టుతున్నారు ఆకాల వర్షంతో చాలా చోట్ల రైతుల వడ్లు తడిసిపోయినాయి వీడియోలు ఫోటోలు మీరు చూసి ఉంటారు ఈ వడ్లు మామూలు రైస్ మిల్లులకు కాకుండా బైల్డ్ రైస్ మిల్లులకు ఇవ్వడం వల్ల రైతులకు కొంత మేరకు మేలు చేసిన వారు అవుతారు బైల్డ్ రైస్ మిల్ తడిసిన వడ్లు ఇచ్చిన వారికి ఎలాంటి నష్టం ఉండదు మామూలు రైస్ మిల్ వారు ఇప్పటికే వడ్ల సెంటర్ నుండి పంపిన వడ్ల లారీలను దించకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు కావున మన జిల్లాలో దాదాపుగా 10 బైల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయని సమాచారం ఉంది బైల్డ్ రైస్ మిల్లు చాలా వరకు మూతపడి ఉన్నాయి బీరు బైల్డ్ రైస్ మిల్లు యాజమాన్యంతో అతి త్వరగా సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడి బైల్డ్ రైస్ మిల్లులు తెరిపించి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మీరు చేయడం వల్ల రైతులను కొంతమేర అందుకోగలరు అని మా మండల రైతుల తరఫున మీకు అభ్యర్థిస్తున్న రైతులు.


