 
									 
జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో పంటల నష్టం, ప్రజల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.


