Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు.భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు.అతని అసాధా రణమైననాయకత్వానికి,జాతీయ సమైక్యతకు లొంగని నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన పటేల్“భారతదేశపు ఉక్కు మనిషి”గా పిలుస్తారు. జాతీయ ఐక్యతా దినోత్సవం విభిన్న రాచరిక రాష్ట్రాలను ఒకే దేశంగా ఏకం చేయ డానికి భారతదేశ ప్రజలలో సంఘీభావ స్ఫూర్తిని పెంపొందిం చడానికి ఆయన చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిలు యల్లటూరు శివరామరాజు,షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూ బకర్, నీటి సంఘం చైర్మన్ నారదాసు రామచంద్ర, పత్తి నారాయణ, లక్ష్మీపతి రాజు, బిజెపి నాయకులు వినోద్ వర్మ, గాజుల కులాయప్ప, ప్రసాద్, కొమ్మినేని సుబ్బరా యుడు, మౌలా,గూడూరు శ్రీనివాస రాజు,శంకరరాజు,సురేంద్ర, సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.