

జనం న్యూస్ 31//జనవరి //జమ్మికుంట //కుమార్ యాదవ్..
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి రాచపల్లి సాగర్ ఆధ్వర్యంలో స్థానిక జమ్మికుంట లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కి నియోజకవర్గ ఇన్చార్జి వోడితెల ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, నాయకులు, ఈ సందర్బంగా మాట్లాడుతూ..రెండో విడత నిధుల విషయంలో ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేయుట పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే హుజురాబాద్ లో దళిత బంధు ప్రారంభం నుండి పలు శాఖల మంత్రులకు కలసి వినతి పత్రాలు ఇస్తూ రెండో విడత వచ్చేంతవరకు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ముందు వరుసలో ఉండి సాధించుకోవడం జరిగినది, అన్నారు.అలాగే రెండో విడత మంజూరు విషయంలో ప్రత్యేక చొరవ చూపిన హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ మైసా సాంబయ్య,జిల్లా ఉపాధ్యక్షులు పులాల నరేష్,ప్రధాన కార్యదర్శి రాచపల్లి వంశీ,జిల్లా ఉపాధ్యక్షులు పోడేటి వేణు,జిల్లా కార్యదర్శి సలిగంటి సతీష్, నియోజకవర్గ ఇన్చార్జ్ రాచపల్లి సాగర్, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు మడిపల్లి చక్రపాణి, సీనియర్ నాయకులు పాతకాల సంపత్,మొలుగూరి రాజేందర్,కొడపాక రక్షిత్,కవ్వంపల్లి నవీన్,మోరే వెంకటేష్ ,మొలుగూరి సురేందర్, ఆరెపల్లి శీను, రాచపల్లి రాజు ,రాచపల్లి గణేష్, రాచపల్లి రజిని కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.