 
									 
రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం నిర్వహించిన బిచ్కుంద పోలీస్
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి
బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి. సందర్భంగా సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి కందరుపల్లి బసవేశ్వర చౌరస్తా వరకు “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో భాగంగా 3k రన్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సై మోహన్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభయ్ పటేల్ జన్మదినం సందర్బంగా జాతీయ ఐక్యతా దినోత్సవం లో భాగంగా ప్రజల కు పటేల్ చేసిన సేవలు తెలియజేయాలి అని, దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని పేర్కొన్నారు. బిచ్కుంద నుండి కందరుపల్లి వరకు త్రీ కే రన్ విజేతలకు బహుమతులను సిఐ, ఎస్ఐ ప్రధానం చేసినారు ఈకార్యక్రమంలో సిఐ తో పాటు బిచ్కుంద వ్యాపారవేత్త కోలావర్ కుమార్ సెట్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్ సీమ గంగారం, కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ రెడ్డి, జ్వాలాముఖి డాక్టర్ , ఎన్ శ్రీనివాస్ సార్, నాగనాథ్ సార్ విద్యార్థులు యువత, క్రీడాకారులు మరియు పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




