 
									 
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం
జనం న్యూస్ అక్టోబర్ 31 సంగారెడ్డి జిల్లా
 పటాన్‌చెరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వర్షపు నీరు నిలిచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుమార్లు వర్షం కారణంగా కార్యాలయ పరిసరాల్లో నీరు నిలిచిపోతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కార్యాలయానికి వచ్చే ప్రజలు నీటిని దాటుకుని ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం పరిసరాలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రదేశం అయినా, డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షం పడితే చిన్న చెరువుగా మారిపోతోంది.
ప్రజల సమస్యల పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటిని తొలగించి, శాశ్వత పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


