Listen to this article

జనంన్యూస్. 31.నిజామాబాదు.

మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలను యుద్ధప్రతిపధికన కొనుగోలు చేయాలి.పంటలన్నీటీకి 33% నష్టపోతేనే నష్టపరిహారం ఇచ్చే నిబంధన తొలగించాలని. తడిసిన ధాన్యాన్ని 20% శాతం మ్యాచర్ ఉన్న కొనుగోలు చేయాలని, మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలను యుద్ధప్రతిపధికన కొనుగోలు చేయాలని
అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) ఆధ్వర్యంలో రైతంగానికి వర్షాల వల్ల 20% శాతం సహితం తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి అని, నష్టపోయిన రైతంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి అని జేసికి వినతి పత్రం సమర్పించారు.అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్ మాట్లాడుతు.మోంథా తుఫాన్ వల్ల జిల్లాల్లో రైతాంగం నోటికి వచ్చిన పంట నష్టపోయారని ఆరు అలా కష్టపడ్డ రైతాంగం కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని తక్షణమే యుద్ధ ప్రతిపాదికన అరిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ సెప్టెంబర్ మొదటి వారంలో నోటికి వచ్చిన వరి పంట సోయా మొక్కజొన్న పంటలు నీటతడిసి తీవ్రంగా నష్టపోయారన్నారు. వేలాది ఎకరాల్లో ఇసుక మేడలు పెట్టయని అన్నారు. 14% కురిసిన వర్షం వల్ల జిల్లాలో వేలాది ఎకరాలు, లక్షల మెట్రిక్ టన్నులవరి పంట, మొక్కజొన్న నీటి పాలు అయిందన్నారు. ఐకెపి, సహకార సంఘాలు, ఐడీసిఎం ఎస్ కేంద్రాల్లో సైతం ధాన్యం సంచులు తడిసినవని ఆయన గుర్తు చేశారు రైతు యూనిటీగా 33% నష్టం జరిగితిని నష్టపరిహారం ఇవ్వాలన్న నిబంధన రైతులకు శాపంగా మారిందని దీన్ని ఎత్తివేయాలి అన్నారు. గతంలో 2021 23 లో అకాల వర్షం, 2022 23 లో తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించకపోవడం సిగ్గుచేటు అన్నారు.కౌలు రైతులకు సైతం అష్టపరిహారం అందించాలి బి.దేవరాం ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి.కౌలు రైతులకు సైతం అష్టపరిహారం అందించాలని, పంటలన్నీటీకి 33% నష్టపోతేనే నష్టపరిహారం ఇచ్చే నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం తొందరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.కార్యక్రమంలో ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ సురేష్ బి బాబన్న లు మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం విస్మరించడం సిగ్గుచేటు అన్న. తక్షణమే నష్టపరిహారం అందరికి అందిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏఐయుకేఎస్ ఉపాధ్యక్షులు జీ పరమేష్ ఆకుల గంగారం కార్యదర్శి అర్ దామోదర్ యు రాజన్న తదితరులు పాల్గొన్నారు