 
									 
జనం న్యూస్ అక్టోబర్ 31 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వినూత్నంగా ప్రచారం చేపట్టింది. మాట ముచ్చట అనే కార్యక్రమం ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎర్రగడ్డ డివిజన్ జె.కే పాయింట్ హోటల్ లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ మరియు వివేకానంద నగర్ మాజీ కార్పోరేటర్ మాధవరం రంగారావు టీ తాగుతూ అక్కడే ఉన్న ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరిస్తూ, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీతా గోపీనాథ్ కారు గుర్తుకు ఓటు ఎందుకు వేయాలో కూలంకషంగా వివరించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలను గుర్తు చేస్తూ బిఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.


